హీరో ఆనంద్ దేవరకొండ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన సినిమా ‘తక్షకుడు’. ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు వినోద్ అనంతోజు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆనంద్ దేవరకొండ, వినోద్ అనంతోజు కాంబోలో వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మూవీ లవర్స్ దష్టిని మరింతగా ఆకర్షిస్తోంది.
ఈ చిత్రాన్ని నాగవంశీ.ఎస్, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో నితాన్షీ గోయెల్ నాయికగా నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సోమవారం నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ‘వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు..’ అనే ట్యాగ్ లైన్ ఆకట్టుకుంటోంది. హీరో ఆనంద్ దేవరకొండ చేతిలో తుపాకీ పట్టుకుని ఉండటం, ఒక ఊరు అగ్నికి ఆహుతి అవుతున్నట్లు డిజైన్ చేసిన పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ఆనంద్ దేవరకొండ కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ అటెంప్ట్ కానుందని ఈ పోస్టర్ చెప్పకనే చెబుతోంది.
‘తక్షకుడు’గా ఆనంద్ దేవరకొండ
- Advertisement -
- Advertisement -