Thursday, February 5, 2026
E-PAPER
Homeజాతీయంఆనంద్‌ తేల్తుంబ్డే పుస్తక చర్చ రద్దు

ఆనంద్‌ తేల్తుంబ్డే పుస్తక చర్చ రద్దు

- Advertisement -

పోలీసుల ఆదేశాల కారణమన్న నిర్వాహకులు
ముంబయి :
ముంబయిలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కలా ఘోడా ఆర్ట్స్‌ ఫెస్టివల్‌లో భాగంగా సామాజిక కార్యకర్త ఆనంద్‌ తేల్తుంబ్డే పాల్గొనే పుస్తక చర్చా కార్యక్రమం రద్దయ్యింది. ముంబయి పోలీసులు ఆదేశాలిచ్చి రద్దు చేయించారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సోషల్‌ మీడియా పోస్టులను కూడా తొలగించాలని ఈ కార్యక్రమంలో పాల్గొనేవారిని కోరినట్టుగా కూడా తెలిసింది. ‘ఇన్‌క్సారేటెడ్‌ : టేల్స్‌ ఫ్రం బిహైండ్‌ బార్స్‌’ అనే పేరుతో జరగాల్సిన ఈ చర్చలో ఆనంద్‌ తేల్తుంబ్డేతో పాటు రచయిత నీతా కొల్హట్కర్‌ కూడా మాట్లాడాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని స్క్రోల్‌ సంపాదకులు నరేశ్‌ ఫెర్నాండేజ్‌ మోడరేట్‌ చేయాల్సి ఉండగా.. చివరి నిమిషంలోనే అది రద్దయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -