- Advertisement -
నవతెలంగాణ – పెద్దవంగర: పెద్దవంగర బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ గా మండల కేంద్రానికి చెందిన అనపురం లింగన్న గౌడ్ నియమితులయ్యారు. జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహమూర్తి చేతుల మీదుగా శుక్రవారం ఆయన నియామకం పత్రం అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన స్వగ్రామం, విద్యాబుద్దులు నేర్చుకున్న గ్రామంలోనే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా తొలి పోస్టింగ్ తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచడానికి, వారికి ఉత్తమ సేవలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. కాగా గ్రామానికి చెందిన లింగన్న హాస్టల్ వార్డెన్ గా ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు, విద్యావంతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -