Thursday, March 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రంలో అరాచక పాలన

రాష్ట్రంలో అరాచక పాలన

- Advertisement -

‘డిండి ఎత్తిపోతల’లో నల్లగొండకు నీళ్లు రాకుండా కుట్ర :మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-దేవరకొండ

రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, కేవలం పోలీస్‌ శాఖ మాత్రమే పని చేస్తోందని.. అది కూడా కాంగ్రెస్‌ నాయకులకు తొత్తులుగా పని చేస్తోందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణ కేంద్రంలోని సాయి శివ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం చందంపేట మాజీ ఎంపీపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ముత్యాల సర్వయ్యతో పాటు 400 మంది కార్యకర్తలు జగదీశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు రమావత్‌ రవీంద్ర కుమార్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మాట్లా డుతూ జిల్లాలో ఇద్దరు మంత్రుల ఉన్నా శుద్ధ దండగ అన్నారు.

సాగర్‌ కింద, ఎస్‌ఎల్‌బీసీ కింద నీళ్లు ఇవ్వలేని చావ లేని, సత్తా లేని మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అని విమర్శించారు. డిండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కూడా నల్లగొండకు నీళ్లు రాకుండా పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. అయినా ఇద్దరు మంత్రులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతుబంధును మూడు సార్లు ఎగ్గొట్టిన మోసగాడు సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా, యూరియా లేక కరెంట్‌ ఇవ్వకుండా పంటలను ఎండబెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీకి.. కేరళ ఎన్నికల కోసం తెలంగాణ సొమ్మును వందల కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధిష్టానానికి తెలంగాణ ఏటీఎంలా మారిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -