- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ రచయిత, తెలంగాణ గీత రచయిత అందెశ్రీ (64) ఆకస్మిక మరణం పట్ల సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. పలు పురస్కారాలు అందుకున్న అందెశ్రీ అనేక అభ్యుదయ గీతాలు రచించారని, ఈ కాలపు వాగ్గేయకారులలో అందెశ్రీ ఒకరని, వారి మరణం సాహిత్య రంగానికి తీరని లోటు అని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విచారం వ్యక్తం చేశారు.
- Advertisement -



