రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేష్ బాబు. పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన టైటిల్ గ్లింప్స్, బ్లాక్‌బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. రామ్‌ను డై-హార్డ్ సినిమా బఫ్‌గా ప్రజెంట్ చేసిన టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలను సష్టించింది. వివేక్, మెర్విన్ స్వరపరిచిన ‘నువ్వుంటే చాలే’ పాటను అనిరుధ్ రవిచందర్ పాడగా, రామ్ పోతినేని స్వయంగా రాసిన లిరిక్స్ వైరల్‌గా మారి అందరినీ ఆకట్టుకుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా థియేటర్ రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. నవంబర్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ స్టైలిష్ ఎనర్జిటిక్ అవతర్‌లో కనిపించి థియేటర్లలో ఫెస్టివల్ వైబ్‌ని సెట్ చేశారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ప్రముఖ సినీ సూపర్ స్టార్ పాత్రను పోషించారు అని మేకర్స్ పేర్కొన్నారు.
‘ఆంధ్రా కింగ్ తాలూకా’రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -