నవతెలంగాణ – విశాఖపట్టణం: సెప్టెంబర్ 22న ప్రారంభమైన ఈ అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025లో ఆంధ్రప్రదేశ్ లోని వినియోగదారులు మరియు సెల్లర్స్ ఉత్సాహవంతంగా పాల్గొన్నారు. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & బ్యూటీ, నిత్యావసరాలలో శక్తివంతమైన వృద్ధి కనిపించింది. అమేజాన్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్ నుండి శ్రేణుల్లో విక్రయించే సెల్లర్స్ 23,000 మందికి పైగా ఉన్నారు మరియు మరియు రాష్ట్రంలో అన్ని పిన్ కోడ్స్ కు వేగంగా మరియు సౌకర్యవంతంగా అందచేయడానికి 105కి పైగా డెలివరీ స్టేషన్స్ అమేజాన్ కి ఉన్నాయి.
అక్టోబర్ 6 నుండి కస్టమర్లు Amazon.inలో “దీపావళి ప్రత్యేకం“తో డీల్స్ మరియు ఆఫర్లను పొందవచ్చు మరియు స్మార్ట్ ఫోన్స్ పై 40% వరకు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & బ్యూటీ, హోమ్ కిచెన్ & అవుట్ డోర్స్ పై 80% వరకు తగ్గింపు పొందవచ్చు; నిత్యావసరాలపై 70% వరకు తగ్గింపు పొందవచ్చు; TVలు మరియు గృహోపకరణాలపై 50% వరకు తగ్గింపును పొందవచ్చు; అమేజాన్ ఫ్రెష్, అలెక్సాతో ఇకో, ఫైర్ TV & కిండిల్ మరియు ఇంకా ఎన్నో వాటిపై 50% వరకు తగ్గింపు పొందవచ్చు.
సమీర్ లాల్వాని- ప్రోడక్ట్ మరియు బిజినెస్ హెడ్- అమేజాన్ బజార్, ఇలా అన్నారు,“ఆంధ్రప్రదేశ్ లో కస్టమర్లు అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025ను ఇంతకు ముందు కంటే పెద్దగా సంబరం చేస్తున్నారు. ప్రీమియం TVలు మరియు విలువైన జ్యువలరీ నుండి నిత్యావసరాలు మరియు అత్యంత సరసమైన ఉత్పత్తుల్ని అమేజాన్ బజార్ నుండి కొనుగోలు చేస్తున్నారు. GST ఆదాలు, బ్యాంక్ ఆఫర్లు మరియు అమేజాన్ పే రివార్డ్స్ తో పండగ షాపింగ్ ఇంతకు ముందు కంటే ఎక్కువగా మరింత సరసమైనదిగా, సౌకర్యవంతమైనదిగా మరియు బహుమానపూర్వకమైనదిగా చేస్తున్నాము. ఇంకా ఈ సీజన్ లో ఆంధ్రప్రదేశ్ నుండి ఆర్డర్లు వార్షికంగా 26 రెట్లు వృద్ధి చెందాయి మరియు కొత్త కస్టమర్లు వార్షికంగా 4.2 రెట్లు పెరగడం ద్వారా అమేజాన్ బజార్ అమోఘమైన వేగాన్ని చూసింది. గొప్ప ప్రదర్శన చూపించిన విశాఖపట్టణం, పండగ సమయంలో 2.2 % రెట్లు సహా వార్షికంగా 22 రెట్ల కంటే అధికంగా వృద్ధిని నమోదు చేసింది. 2024లో ప్రారంభించబడిన అమేజాన్ బజార్ భారతదేశపు అత్యంత సరసమైన ఆన్ లైన్ షాపింగ్ గమ్యస్థానాల్లో ఒకటిగా వేగంగా మారింది, రూ. 600 లోపు 2 కోట్లకు పైగా ఉత్పత్తులను అందిస్తోంది. విక్రేతల్లో 6 రెట్ల పెంపుదలతో మరియు టియర్ 2 మరియు 3 పట్టణాల నుండి 65%కి పైగా షాపర్స్ తో, బజార్ ఫ్యాషన్, హోమ్ డెకార్, కిచెన్ వేర్, మరియు యాక్ససరీస్ లో రూ. 79కి ప్రారంభమయ్యే లక్షలాది డీల్స్ తో కస్టమర్లు తెలివిగా షాపింగ్ చేయడంలో సహాయపడింది. ఈ పండగ సీజన్ లో, ఆంధ్రప్రదేస్ లోని ప్రతి కుటుంబం మరింత అర్థవంతంగా వేడుక చేయడంలో అమేజాన్ సాటిలేని ధరలు, నమ్మకమైన సౌకర్యం, మరియు విలువలను అందించడాన్ని అమేజాన్ కొనసాగించింది.
విశాఖపట్టణంలో కీలకమైన షాపింగ్ ధోరణులు
ప్రీమియం ఎంపికలు ఆధారంగా పండగ షాపింగ్: రూ.20,000 కంటే ఎక్కువ ధరలు గల స్మార్ట్ ఫోన్లకు పండగ యొక్క ప్రారంభపు రోజుల సమయంలో శక్తివంతమైన రెండంకెల వృద్ధిని నమోదు చేసాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియం శ్రేణి (రూ. 30,000 కంటే ఎక్కువగా) YoY 1.6 రెట్లు పెరుగుతోంది.
పండగ ఇష్టాలుగా విలువ అవసరాల వృద్ధి: పండగల సమయంలో హోమ్, కిచెన్ మరియు ఫ్యాషన్ వస్తువులు ఆధిపత్యంవహించాయి. ద గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 రాష్ట్ర ఆర్డర్లలో క్లీనింగ్ సరఫరాలు, స్టోరేజ్ వస్తువులు, మహిళల ఫ్యాషన్ లలో 2.3 రెట్లు పెంచింది, తదుపరి మహిళల ఫ్యాషన్ లో కుర్తీస్, జీన్స్ మరియు దుపట్టాస్ కోసం అత్యధిక డిమాండ్ వచ్చింది.
పోషకాహార ఉత్పత్తులు మరియు నిత్యావసరాలకు ఎంతో డిమాండ్: ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించిన కొనుగోళ్లతో విశాఖపట్టణం శక్తివంతమైన వృద్ధిని చూపించింది, పోషకాహార ఉత్పత్తిపై చేసే ఖర్చు 2.6 రెట్లు వార్షికంగా పెరిగింది. అమేజాన్ ఫ్రెష్ ఆర్డర్లు సుమారు 1.6 రెట్లు పెరిగాయి, సౌకర్యవంతమైన కిరాణా ఎంపికల కోసం కస్టమర్లలో పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రదర్శించింది.
ఫ్యాషన్ మరియు బ్యూటీలు వేగం పుంజుకున్నాయి: వ్యక్తిగత సంరక్షణ వస్తువులపై వార్షికంగా 2.8 రెట్లు ఖర్చు చేసారు- హెయిర్ మాస్క్స్ మరియు ఆయిల్స్ 2 రెట్లు పెరిగాయి. విశాఖపట్టణంలో బ్యూటీ మరియు వ్యక్తిగత సంరక్షణపై ఖర్చులు వార్షికంగా 2.3 రెట్లు పెరిగాయి, మెన్స్ ఎథ్నిక్ వేర్ 2 రెట్లు పెరిగింది మరియు డెనిమ్ లో మహిళలు మరియు మగవారు ఇరువురి డిమాండ్ YoY1.5 రెట్లు పెరిగింది.
హోమ్ అప్ గ్రేడ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి: విశాఖపట్టణంలో వాటర్ ప్యూరిఫైర్లు, కిచెన్ స్టోరేజ్ మరియు కుక్ వేర్ లు కారణంగా కిచెన్ ఉపకరణాలు వార్షికంగా సుమారు 2.5 రెట్లు పెరిగాయి.
గత ఎడిషన్స్ తో పోల్చినప్పుడు మొదటి 10 రోజుల అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సమయంలో స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ (SMBలు) లు రికార్డ్ స్థాయిలో పాల్గొన్నాయి. 1 కోటి అమ్మకాలు జరిగి స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ వ్యాపారాల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ 100% ఆకర్షించే పెరుగుదలను నమోదు చేసింది. ఈ విజయాలు భారతదేశంవ్యాప్తంగా స్థానిక ఔత్సాహికులకు సాధికారత కల్పించడంలో మరియు సమీకృత ఆర్థిక వృద్ధిని సాధించడంలో డిజిటల్ మార్కెట్ ప్రదేశాల యొక్క బాధ్యతను ప్రధానాంశంగా చూపించాయి. ఈ SMBలలో రెండు వంతులకు పైగా టియర్ 2,3 పట్టణాలకు మరియు అంతకు మించి ఉన్నాయి.