Wednesday, July 16, 2025
E-PAPER
Homeఖమ్మంపోషకాహారంతో రక్తహీనత అధిగమించవచ్చు..

పోషకాహారంతో రక్తహీనత అధిగమించవచ్చు..

- Advertisement -

స్వయం సహాయక సమూహం సభ్యులకు రక్తహీనత నిర్ధారణ: డాక్టర్ రాందాస్
నవతెలంగాణ – అశ్వారావుపేట
: పోషకాహారం తో రక్తహీనతను అధిగమించవచ్చు అని అశ్వారావుపేట (వినాయక పురం) ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బి.రాందాస్ అన్నారు. అనీమియా ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో స్వయం సహాయక బృందం సభ్యులకు( సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్) సభ్యులకు రక్తహీనత నిర్ధారణ శిబిరం నిర్వహించారు. రక్త నమూనాలను సేకరించారు. అనంతరం ఆయన రక్తహీనత తో  కలిగే అనర్ధాలు ను మహిళా సమాఖ్య సభ్యులకు వివరించారు.

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి లేదా ఎర్ర రక్త కణాలు (ఆర్.బీ.సీ లు) తగ్గిపోవడం తో రక్తహీనత ఏర్పడుతుంది అని అన్నారు.రక్తహీనత కారణంగా శరీరానికి తగిన ప్రాణవాయువు( ఆక్సిజన్) సరఫరా జరగకుండా చేస్తుంది అని తెలిపారు. అలసట, బలహీనత, ముఖం, పెదాలు, చేతులు పళ్లెం పడటం, మునుగులు పట్టడం (చేస్తే మూర్చ వస్తుండటం), తలనొప్పి, గుండె వేగం( గెంతులు) పెరగడం రక్తహీనత లక్షణాలు అన్నారు.

ఇనుము లోపం (ఐరన్ లోపించడం) ముఖ్యమైన కారణం అని,ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 లోపం,తీవ్ర రక్తస్రావం (ఋతు క్రమంలో అధిక రక్తస్రావం, గర్భధారణలో,ప్రమాదాల వల్ల,అంతర్భాగ కాలయుత రోగాలు (క్రానిక్ డిసీజ్) అని,అధిక గర్భ ధారణ లు లేదా తక్కువ విరామంలో గర్భధారణ కారణాలుగా పేర్కొన్నారు.

ఇనుముతో సమృద్ధిగా ఉన్న ఆహారాలు, గోంగూర, తోటకూర, పాలకూర బీట్‌రూట్, క్యారెట్ రాగి, బజ్రా, ఖర్జూరం మూంగ్ దాల్, కబ్బు మాంసాహారం (లివర్, ఎర్ర మాంసం), గుడ్లు విటమిన్ C ఉన్న ఆహారం (ఇనుము శోషణ కు సహాయపడుతుంది): నిమ్మకాయ రసం, ఆరంజ్, మామిడి, ఉసిరికాయ ఆహారంలో తీసుకోవడంమే చక్కని పరిష్కారం అని తెలిపారు.

ఐరన్ టాబ్లెట్లు / సిరప్ ఫోలిక్ యాసిడ్, బి 12 టాబ్లెట్లు, తీవ్ర స్థాయిలో అయితే రక్త మార్పిడి (బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్) చికిత్స గా చేయాలని అన్నారు. రక్త హీనత నిర్ధారణ కోసం సీబీసీ (కంప్లీట్ బ్లడ్ కౌంట్ – సంపూర్ణ రక్తకణాల లెక్కింపు),సీరం ఫెర్రిటిన్ విటమిన్ బీ 12,ఫోలేట్ లెవెల్ పరీక్షల ద్వారా రక్త హీనత నిర్ధారించి,పరిస్థితిని బట్టి వైద్యుని సలహాతో చికిత్స చేయించుకోవాలని సూచించారు.అవసరమైతే ఐరన్ మందులు,ఆహారం నియమాలు(డైట్స్ ప్లాన్ )కూడా తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమం లో  70 మంది మహిళా సమాఖ్య సభ్యులకు రక్తహీనత పరీక్షలు చేసి వారి హిమోగ్లోబిన్ శాతం ను తెలియజేసారు.  ఈ కార్యక్రమం లో డీపీఎంవో మోహన్,ఎంఎల్ హెచ్ పీ లు ఉష, మాధురి, స్రవంతి, ఏఎన్ఎం లు జ్యోతి, అరుణ, సుజాత, భూ లక్ష్మి, ఆశ కార్యకర్తలు, మహిళా సమాఖ్య అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -