నవతెలంగాణ – వీర్నపల్లి
చిన్నార్లుకు అక్షరాలు నేర్పే తొలిబడి అంగన్వాడీ కేంద్రాలేనని సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ అన్నారు. వీర్నపల్లి మండలం కేంద్రంలో వన్ పల్లి, కంచర్ల, సీతారం నాయక్ తండా గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్ లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం, చిన్నారులకు ప్రభుత్వం అందించిన ఏకరూప దుస్తులను శుక్రవారం పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేవలం చదువు మాత్రమే కాకుండా, ప్రభుత్వం అందించే బలవర్ధకమైన ఆహారం పిల్లల శారీరక పెరుగుదలకు ఎంతో అవసరమని ఆమె గుర్తు చేసి ఉండవచ్చు.
చిన్నారులకు అక్షరాలు నేర్పే ఈ తొలిబడి ని సద్వినియోగం చేసుకోవాలని, పిల్లల బంగారు భవిష్యత్తుకు ఇక్కడే బాటలు వేయాలని సూచించారు .ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లేశం, సర్పంచ్ గూగులోతు రమేష్, సామల్ల దేవ రాజు, భూక్యా లత, తడగొండ సాయిలు,ఉప సర్పంచ్ జక్కుల నరేష్, తిరుపతి , ఏ ఎం సి డైరెక్టర్ భూక్యా సంతోష్ నాయక్,దేవేందర్,వార్డు సభ్యులు భగ వంతం, సంజీవ్,గోరేమియా, దేవ లక్ష్మీ, ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ మమత, ఎం ఈ ఓ శ్రీనివాస్,నాయకులు తిరుపతి, నవీన్, నాగరాజు, కుమార్, సతీష్, ఎంపీపీఎస్ హెచ్ ఎం రజిత, దివ్య,అంగన్వాడీ టీచర్ లు జ్యోతి, నాగ రాణి, రాధిక, తదితరులు పాల్గొన్నారు.



