చిన్నారులకు ఎగ్ బిర్యానీ తయారు..
నవతెలంగాణ – పెద్దవూర : అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పెద్దవూర మండలం పర్వేదుల సెక్టార్ పరిధిలోని ఉట్లపల్లి గ్రామంలో సెక్టార్ సూపర్ వైజర్ వెంకాయమ్మ ఆధ్వర్యంలో అంగన్వాడీ బడిబాట ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అనుముల ప్రాజెక్టు ఐసీడీ ఎస్ సీడీపీఓ ఉదయ శ్రీహాజయ్యారు.ఈసందర్బంగా చిన్నారులు తల్లిదండ్రులు, గ్రామ పెద్దలతో కలసి అంగన్వాడి కేంద్రాలలో సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు.రెండున్నర సంవత్సరాల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులను తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.అంగన్వాడి కేంద్రాలలో రెండున్నర సంవత్సరాల నుంచి ఐదేళ్లలోపు పిల్లల్ని తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉదయ శ్రీమాట్లాడుతూ చిన్నారులకు మానసిక శారీరక వృద్ధి,వ్యాధి నిరోధక టీకాలు కేంద్రాలలో వేసియిస్తున్నామని తెలిపారు.ఆరోగ్య పరీక్షలు, పౌష్టికాహారం, ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నామని అన్నారు.సామూహిక అక్షరాభ్యాసాలు, పాలు గుడ్డు, ఒకపూట సంపూర్ణ ఆహారం తమ అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు అందిస్తున్నామని తెలిపారు.అనంతరం అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు,గర్భిణీ,బాలింతలకు ఎగ్ బిర్యానీ తయారు చేసి వడ్డించారు.ప్రభుత్వ పాఠశాల ప్రధానో పాధ్యాయులు బిక్షపతి,అంగన్వాడీ టీచర్లు రజిత,శారద,జ్యోతి,నిర్మల,అంగన్వాడీ లబ్ధిదారులు ఉన్నారు.
ఉట్లపల్లిలో అంగన్వాడీ బడిబాట.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES