నవతెలంగాణ – పెద్దవూర : అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పెద్దవూర మండలం చలకుర్తిలో బుధవారం సెక్టార్ సూపర్ వైజర్ గౌసియా బేగం ఆధ్వర్యంలో అంగన్వాడీ బడిబాట ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు తల్లిదండ్రులు, గ్రామ పెద్దలతో కలసి అంగన్వాడి కేంద్రాలలో రెండున్నర సంవత్సరాల నుంచి ఐదేళ్లలోపు బడియుడు పిల్లల్ని తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.అంగన్వాడి కేంద్రాలలో రెండున్నర సంవత్సరాల నుంచి ఐదేళ్లలోపు పిల్లల్ని తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ సూపర్ వైజర్ గౌసియా బేగం మాట్లాడుతూ చిన్నారులకు మానసిక శారీరక వృద్ధి,వ్యాధి నిరోధక టీకాలు కేంద్రాలలో వేసియిస్తున్నామని తెలిపారు.ఆరోగ్య పరీక్షలు, పౌష్టికాహారం, ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నామని అన్నారు.సామూహిక అక్షరాభ్యాసాలు, పాలు గుడ్డు ఒకపూట సంపూర్ణ ఆహారం తమ అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు అందిస్తున్నామని తెలిపారు.అనంతరం అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు,గర్భిణీ,బాలింతలకు ఎగ్ బిర్యానీ తయారు చేసి వడ్డించారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి పవన్,అంగన్వాడీ టీచర్లు యాదమ్మ,మంగమ్మ,ఈదమ్ము తదితరులు పాల్గోన్నారు.
చలకుర్తిలో అంగన్వాడీ బడిబాట..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES