Tuesday, April 7, 2026
E-PAPER
Homeజిల్లాలుచిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేసేది అంగన్వాడీ టీచర్లే

చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేసేది అంగన్వాడీ టీచర్లే

- Advertisement -

ఎమ్మెల్యే మందుల సామేలు

నవతెలంగాణ తుంగతుర్తి: అంగన్వాడీల పనితీరును మెరుగుపరచడానికి, సాంకేతికను జోడించడానికి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. మంగళవారం తుంగతుర్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ సూపర్వైజర్లకు టీచర్లకు 5జి ఫోన్లను అందజేసి మాట్లాడారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం, క్షేత్రస్థాయిలో పౌష్టికాహార పంపిణీ, పిల్లల ఆరోగ్య పర్యవేక్షణలో ఈ మొబైల్ ఫోన్లు కీలక పోషిస్తాయని అన్నారు. ఆరు సంవత్సరాల లోపు దశ పిల్లల ఎదుగుదల అత్యంత కీలకమైనదని,ఈ సమయంలో వారికి సరైన పోషకాహారం అందకపోతే దేశ భవిష్యత్తుకే నష్టం అన్నారు. చిన్నప్పుడే పౌష్టికాహారం అందించి అనారోగ్యాలను నివారించడం మేలని అన్నారు.అంగన్వాడీల ఇబ్బందులను పరిష్కరించేందుకు సేవలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. గర్భిణీలు,బాలింతలు, చిన్నారుల ఆరోగ్య వివరాల, పౌష్టికాహారం పంపిణీ,హాజరు,సెంటర్ కార్యకలాపాలను పోషణ ట్రాకర్ యాప్లో వేగవంతంగా పారదర్శకంగా నమోదు చేయడానికి 5జి సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తుంగతుర్తి ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడి సూపర్వైజర్లకు టీచర్లకు కలిపి 200 మొబైల్ ఫోన్లు అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న,దాయం ఝాన్సీ రెడ్డి, సిడిపిఓ శ్రీజ,ఎంపీడీవో శేషు కుమార్, తాసిల్దార్ దయానందం, అంగన్వాడీ సూపర్వైజర్లు టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -