Tuesday, September 16, 2025
E-PAPER
Homeవరంగల్అంగన్వాడీల ఆందోళన బాట.!

అంగన్వాడీల ఆందోళన బాట.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు:
సమస్యల పరిష్కారానికి అంగమాడీ టీచర్లు,హెల్పర్లు ఉద్యమబాట పట్టాయి.గర్భిణీలు,బాలింతలు,చిన్నారులు బాగోగులను అంగన్వాడీ టీచర్లు,ఆయాలు చూడవంటున్నారు.నిత్యం వారికి పాలు,గుడ్లు,పౌష్టికా హారంతోపాటు ఫ్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నారు.ఇవే కాకుండా శ్రీమంతాలు, అక్షరాభ్యాసం తదితర ప్రత్యేక కావ్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అయితే, కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేదని, పని భారం పెరుగుతోందని అంగన్ వాడి టీచర్లు, హెల్పర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రూ.18వేల వేతనం,పీఎఫ్ సౌకర్యం కల్పించాలని,ఎస్ఆర్ఎస్ రద్దు చేసి, ఫ్రీ ప్రైమరీ, సీఎం శ్రీ విద్యకు ఆంగన్ వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇవే కాకుండా ఖాళీలను భర్తీ చేయాలని, మూడు నెలల పీఆర్సీ, సమ్మె కాలపు వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్ల సాధనకు తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా సోమవారం మంత్రుల ఇళ్లను ముట్టడించి ధర్నా చేపట్టె ప్రయత్నం చేశారు.అయినా స్పందించక పోతే 25న రలో సెక్రటేరియట్, అక్టోబర్ 8న జిల్లా కేంద్రాల్లో 5కి.మీల పాదయాత్ర 17వ తేదీ నుంచి ఆన్లైన్ సమ్మె చేపట్టాలని నిర్ణయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -