నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పీఎం శ్రీ పాఠశాలలను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని, పేస్ క్యాప్షర్, ఈకేవైసీ యాప్ లను రద్దుచేయాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కే.సునీత డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.18 వేల వేతనం హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుండి ర్యాలీగా కలెక్టరేట్ కు తరలివచ్చి సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ నిరసనను వ్యక్తంచేశారు.
ఈ సందర్బంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కే.సునీత, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ.. ఎం అంగన్వాడీ సెంటర్లలో ఉండాల్సిన పిల్లలతో పీఎం శ్రీ పాఠశాలలు ఏర్పాటు చేసి అంగన్వాడీ సెంటర్లను నిర్వీర్యం చేసే కుట్రలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్నాలుతున్నాయని మండిపడ్డారు. పీఎం శ్రీ పాఠశాలలను అంగన్వాడీ కేంద్రంలోనే నిర్వహించాలని, పీఎం శ్రీ టీచర్లకు, ఆయాలకు ఇస్తున్న వేతనాన్ని అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఇవ్వాలని ఆ బడ్జెట్ ను అంగన్వాడీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫేస్ క్యాప్షర్, ఈకేవైసీ ఆన్లైన్ పేరుతో అంగన్వాడీలను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. నెట్ సిగ్నల్ సరిగా లేక, పాడైన ఫొన్లతో అటవీ ప్రాంతంలో ఎలా చేస్తారని ప్రశ్నించారు.
అంగన్వాడీలపై వేధింపులు ఆపాలి
అంగన్వాడీలకు వేధింపులను ఆపాలన్నారు. ఈ విద్యావాలంటీర్ల వేతనాలను అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు అందిస్తే తాము నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. అదే విధంగా ప్రీ ప్రైమారీ విద్యను అందిస్తున్నందున ప్రైమరీ పాఠశాలకు కేటాయించే నిధులు అంగన్వాడీలకు ఇవ్వాలన్నారు. తమ ఫోన్లు ఉన్నాయా లేదా వాటి గురించి పట్టిచుకోకుండా ఫెసక్యాప్చర్ పంపాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. దాని కారణంగా నార్నూర్ ఓ అంగన్వాడీకి బ్రెన్ స్ట్రోక్ వచ్చిందన్నారు. ఎఫ్.ఆర్.సీ విధానంతో పేదలకు అంగన్వాడీల ద్వారా అందే సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎం.సుజాత, డీ.సునీతజ, లక్ష్మి, పార్వతి, మధునిక, విజయ, కళావతి పాల్గొన్నారు.