Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల్యవివాహాలు అరికట్టడంలో అంగన్వాడీలు కీలకంగా వ్యవహరించాలి

బాల్యవివాహాలు అరికట్టడంలో అంగన్వాడీలు కీలకంగా వ్యవహరించాలి

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర 
బాల్య వివాహాలను అరికట్టడంలో, శిశు విక్రయాలు, అక్రమ దత్తతపై అంగన్వాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు సూపర్ వైజర్ శశికళ అన్నారు. శుక్రవారం వెల్మ గూడెం పంచాయతీ పరిధిలోని కటికర్ల గూడెం అంగన్వాడీ కేంద్రంలో బేటీ బచావో-బేటీ పఢావో కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ టీచర్ల కు, గ్రామస్తులులకు అవగాహన కల్పించారు. ఈసందర్బంగా సూపర్ వైజర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ వ్యవస్థ 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని, అప్పుడే వారి శారీరక, మానసిక అభివృద్ధి దోహదపడి వారు విద్యనభ్యసించుటలో పురోగతి సాధిస్తారన్నారు. బాల్యవివాహాలు అరికట్టడంలో అంగన్వాడీ వ్యవస్థ కీలకమన్నారు. పుట్టబోయే బిడ్డ ఆడ, మగ ఎవరైనా ఒక్కటేనని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలోనే నాణ్యమైన పౌష్టి కాహారం అంద జేస్తున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -