Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోస పడుతున్న రైతులు 

గోస పడుతున్న రైతులు 

- Advertisement -

వెంటాడుతున్న వర్షాలు 
రాసుల్లోనే మొలకెత్తిన ధాన్యం 
మబ్బులను చూసి రైతులకు వణుకు 
తేమ శాతం రాకపోవడంతో ఆందోళన 
కోతలకు సిద్ధంగా ఉన్న వరి పంట 
నవతెలంగాణ-పాలకుర్తి

నిత్యం వెంటాడుతున్న వర్షాలతో రైతులు గోస పడుతున్నారు. ఆరుగాలం కష్టపడిన రైతులకు పంట చేతికి వచ సమయానికి, అకాల వర్షాలు, అల్పపీడనాలు రైతన్నల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మబ్బులు ఎప్పుడు కమ్ముకుంటున్నాయో, వర్షం ఎప్పుడు వస్తుందో అర్థం కాని స్థితిలో రైతన్న కొట్టుమిట్టాడుచున్నాడు. వరి కోతల ప్రారంభ దశలోనే అకాల వర్షాలు, అల్పపీడనాలు రైతులకు శాపంగా మారాయి. గోసపడుతున్న రైతన్నను చూసి వరుణుడు కరుణించకపోవడంతో రైతులు ఆందోళన చెందుచున్నారు. మబ్బులతో ఆందోళన చెందుతున్న రైతులు కోత కోసి దాన్యం రాశులను పోయడం, మబ్బులతోపాటు చిరుజల్లులకు, వర్షాలకు ధాన్యాన్ని రైతులు ఆరబెట్టకపోవడంతో ధాన్యం రాశుల్లోనే ధాన్యం మొలకెత్తాయి. ధాన్యం మొలకెత్తడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక చోట నుండి మరొక చోటికి ధాన్యాన్ని ఎత్తిపోయడంతో పాటు మొలకెత్తిన ధాన్యాన్ని ఆరబెట్టడంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ధాన్యం ఆరబెట్టే సమయానికి చిరుజల్లులు పడడం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. వర్షాలకు ధాన్యం రాశులు రాసులు గానే ఉండడం, ఆరబెట్టకపోవడంతో తేమ శాతం రాక రైతులు నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. వర్షాలు తగ్గి ఎండలు కొడితే తప్ప తేమశాతం రాలేని పరిస్థితి అని రైతులు వాపోవుచున్నారు. ధాన్యం కొనుగోళ్లకు తొర్రూరు, పాలకుర్తి సొసైటీలతోపాటు ఐకెపిల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ వర్షాలకు ధాన్యం తేమశాతం రాకపోవడంతో నేటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మొలకెత్తిన ధాన్యంతో పాటు రాశులను ఆరబెట్టేందుకు రోడ్లపైనే రైతులు అనేక ఇబ్బందులు పడుచున్నారు. రోడ్లపై ధాన్యం రాశులు ఉండటం, వర్షపు నీరు ధాన్యం రాశుల కింది నుండి ప్రవహించడం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది.

మబ్బులను, అల్పపీడనాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో కోతలకు సిద్ధంగా ఉన్న వరి పంటలను రైతన్నలు కోయించకుండా వాయిదా వేసుకుంటున్నారు. వర్షాలు తగ్గితే తప్ప పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. తేమశాతం వచ్చినప్పటికీ మొలకెత్తిన ధాన్యం, తడిసిన ధాన్యం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసి కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, రైస్ మిల్లర్లు ధాన్యం కోతలు విధించరాదని, ధాన్యం కోతలు విధించకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుచున్నారు. 

అకాల వర్షాలతో ఇబ్బందులు : పోగు ఆంజనేయులు రైతు లక్ష్మీనారాయణ పురం 
అకాల వర్షాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ధాన్యం రాశులు పోసి ఐదు రోజులు అవుతున్నప్పటికీ వర్షాలు ధాన్యాన్ని ఆరబెట్టకుండా అడ్డుపడుచున్నాయి. ధాన్యం రాశుల్లోనే ధాన్యం మొలకెత్తడం ఆందోళనను కలిగిస్తుంది. ధాన్యం రాశులను మార్పిడి చేస్తే తప్ప ధాన్యం మొలకెత్తకుండా నివారించగలుగుతాం. కొనుగోలు కేంద్రాల ఆధ్వర్యంలో కల్లాలు లేకపోవడంతో రోడ్లను ఆశ్రయిస్తున్నామని, అకాల వర్షంతో రోడ్లపై ప్రవహించే వర్షపు నీరు ధాన్యం రాశుల కిందికి చేరడంతో ధాన్యం రాసి తడిసి ముద్దయి ధాన్యం మొలకెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాలను గుర్తించిన తరువాతే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలను ప్రారంభించాలని అధికారులను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -