రూ.17వేల కోట్ల రుణం మోసం కేసులో విచారణ
న్యూఢిల్లీ : రుణ మోసం కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మ్మెన్ అనిల్ అంబానీ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. రూ.17వేల కోట్ల రుణ మోసాలు, మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఆయనకు ఇటీవల ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మంగళవారం ఆయన ఢిల్లీలోని ఇడి ప్రధాన కార్యాలయానికి చేరుకొని అధికారుల ముందు హాజరయ్యారు. ఈ కేసులో అనిల్ అంబానీ వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసిందని సమాచారం. జులై 24 నుంచి మూడు రోజుల పాటు రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన 50 కంపెనీలకు చెందిన 35 ప్రాం తాల్లో, 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించిన అనంతరం.. అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది. రిలయన్స్ ఇన్‌ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా మళ్లించినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు చేపట్టింది.
ఈడీ ఎదుట అనిల్ అంబానీ
- Advertisement -
- Advertisement -