నవతెలంగాణ-హైదరాబాద్: ఎఫ్‌స్టీన్ ఫైల్స్(Epstein files) లో అనిల్ అంబానీ పేరు బయటపడినా..ఎందుకు జైలులో ఆయన వేయడం లేదని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో సంద్భరంగా ఆయన లోక్ సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురించి కూడా ప్రస్తావించారు. అనిల్ అంబానీని ఎఫ్‌స్టీన్‌కు ఎవరు పరిచయం చేశారో పూరికి తెలుసని ఆయన అన్నారు. ఫ్‌స్టీన్ ఫైల్స్‌లో అనిల్ అంబానీ పేరు ఉందని, అతను జైలులో ఎందుకు లేడని, అతన్ని ఎవరు పరిచయం చేశారో నాకు తెలుసు, హర్దీప్ పూరిని ఎవరు పరిచయం చేశారో నాకు తెలుసు” అని ఆయన అన్నారు.
అమెరికాతోపాటు యూరప్ దేశాల్లో ఎఫ్‌స్టీన్ ఫైల్స్(Epstein files) కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అనేక మంది ఉన్నతాధికారులు, ధనవంతులకు ఈ వ్యవహారంలో అనుబంధం ఉందని, వారి పేర్లు బయటికి రావడంతో అనేక మంది ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు.



