నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్
నవతెలంగాణ ప్రధాన కార్యాలయంలో సంతాప సభ
నివాళి అర్పించిన సిబ్బంది
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
నిబద్ధత, అకింతభావంతో పని చేసిన ఉమ్మడి మెదక్ రీజియన్ డెస్క్ ఇన్‌చార్జి అనిల్‌కుమార్ మరణం నవతెలంగాణ సంస్థకు తీరని లోటని నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు.
శుక్రవారం పత్రిక ప్రధాన కార్యాలయం ఎంహెచ్ భవన్‌లో అనిల్‌కుమార్ సంతాప సభ నిర్వహించారు. ముందుగా అనిల్‌కుమార్ చిత్రపటానికి సీజీఎం పి.ప్రభాకర్, బుకహేౌస్ ఎడిటర్ ఆనందాచారి, ఏడీవీటీ జీఎం ఎ.వెంకటేశ్, జీఎంలు, మేనేజర్లు, ఎడిటోరియల్ బోర్డు సభ్యులు, మఫిషల్ సభ్యులు, ఇతర సిబ్బంది పూలమాల వేసి నివాళి అర్పించారు. మృతుని కుటుంబానికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఏడీవీటీ జీఎం ఎ.వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సభలో ప్రభాకర్ మాట్లాడుతూ.. నవతెలంగాణలో ఐదేండ్లుగా పనిచేస్తున్న అనిల్‌కుమార్ హఠాత్తుగా మరణించడం బాధకరమైన విషయమన్నారు. పని పట్ల ఆయనకు ఉన్న అకింత భావం మనందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.
పని సందర్భంలో తోటి సిబ్బందితో వ్యవహరించే తీరు ఆదర్శనీయమన్నారు. బుకహేౌస్ ఎడిటర్ ఆనందచారి మాట్లాడుతూ.. అనిల్ అకాల మరణం ఆయన కుటుంబానికి, నవతెలంగాణకు తీరని లోటని అన్నారు. నవతెలంగాణ సంస్థలో తక్కువ కాలం పాటు పనిచేసినప్పటికీ ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని అన్నారు. మఫిషల్ ఇన్‌చార్జి వేణుమాధవ్ రావు మాట్లాడుతూ.. సంస్థ నిర్ణయాల పట్ల ఎంతో కట్టుబడి ఉండి పనిచేసిన అనిల్‌కుమార్ మరణం విషాదకరమన్నారు. జీఎం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ అనిల్ కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన తోటి సహచారులను పని విషయంలో సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా డెస్క్‌ను నడిపారని తెలిపారు. ఎడిటోరియల్ బోర్డు సభ్యులు మోహన్ కృష్ణ మాట్లాడుతూ అనిల్‌కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీఎంలు భరత్, వాసు, శశికుమార్ పాల్గొన్నారు.
అనిల్‌కుమార్ మరణం ‘నవతెలంగాణ’కు తీరని లోటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES