Monday, July 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఈరవత్రి అనిల్

సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఈరవత్రి అనిల్

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి  : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండ సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ మర్యాదపూర్వకంగా కలిశారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ బీసీ బాంధవుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. బీసీ కులగణనను 100 శాతం డిజిటలైజేషన్ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదేనన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు చిత్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -