Wednesday, October 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలునవతెలంగాణకు అనిత సేవలు అభినందనీయం 

నవతెలంగాణకు అనిత సేవలు అభినందనీయం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నవతెలంగాణ దిన పత్రికలో అనిత చేసిన సేవలు అభినందనీయం అని నవతెలంగాణ రీజియన్ గైడ్ భరత్ అన్నారు. ఈ మేరకు బుధవారం పెన్షనర్స్ భవన్ లో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి రీజియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 21 సంవత్సరాలుగా నవతెలంగాణ దినపత్రికకు అనిత అకౌంటెంట్ గా, సబ్ ఎడిటర్ గా విధులు నిర్వహించారని, ప్రస్తుతం అనారోగ్య పరిస్థితుల కారణంగా విశ్రాంతి తీసుకుంటుందని, ఆరోగ్యం మెరుగుపడ్డాకా తిరిగి విధుల్లో చేరవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.

అదేవిధంగా అనిత మాట్లాడుతూ.. 21 సంవత్సరాలుగా నవతెలంగాణలో విధులు నిర్వహించిన సమయంలో తనకు ఎల్లవేళలా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం నవతెలంగాణ రీజియన్ కమిటీ తరఫున శాలువా మేమంటతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రీజియన్ గైడ్ అజయ్, డెస్క్ ఇంచార్జ్ కృష్ణ, స్టాపర్ మధు, ఉమ్మడి జిల్లా మేనేజర్ సురేష్, నవతెలంగాణ ఉమ్మడి జిల్లా రిపోర్టర్లు, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -