Thursday, April 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠాపన మహోత్సవం

ఆంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠాపన మహోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి : మండలంలోని రామడుగు గ్రామములో గురువారం హనుమాన్ జయంతి వేల ఘనంగా ఆంజనేయ స్వామి ఆలయ రూరల్ ఎమ్మెల్యే డా, భూపతి రెడ్డి ప్రారంభోత్సవం చేశారు.ఈసందర్బంగా అయన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ దేవాదాయ శాఖ ద్వారా నిర్మించాబడిన ఆలయాన్ని ప్రారంభోత్సవం చేయడం తాను అదృష్టంగా భావిస్తున్నానని అన్నరు. అంతకు ముందు గ్రామంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.మొఘలుల నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన గొప్ప మహనీయులు పాపన్న గౌడ్ అని ఎమ్మెల్యే కొనియాడారు.

ఇంతటి గొప్ప కార్యక్రమము  గ్రామస్థులు ఐక్యంగా పట్టుబట్టి ఆలయ నిర్మాణానికి చూపిన సహకారం అభినందనీయమన్నారు. అడుగడుగున అడ్డంకులు ఏర్పడిన వాటిని అధిగమించి ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగిందన్నారు.హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సీలు గ్రామస్తుల పై, నియోజకవర్గ ప్రజల పై ఉండాలని ఆకాంక్షించారు. పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ తమ గ్రామములో అంజన్న ఆలయానికి ఎమ్మెల్యే సహకారం వాళ్లే ఆలయం పూర్తి అయిందని హర్షం వెక్తం చేస్తూ ఎమ్మెల్యేగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే తమ గ్రామములోని పలు సమస్యలను వివరించగా. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రామడుగు గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. అటు గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.చివరిగా గ్రామస్థులు ఎమ్మెల్యేగారికి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు  ఆర్మూర్ చిన్న  బాల్ రాజ్ ,పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు చెలిమేల శ్రీనివాస్,స్థానిక సర్పంచ్ రమేష్ గౌడ్,గ్రామాభివృద్ధికి కమిటీ అధ్యక్షులు జి.రాజారెడ్డి,కే.రాజారెడ్డి,డి.గంగారెడ్డి, శ్రీనివాస్, పోషన్న,ఆనంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిపల్లి పెద్ద సాయి రెడ్డి, పొలసాని శ్రీనివాస్, ధర్మాగౌడ్, రాంచందర్ గౌడ్, నరేందర్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -