Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మథురా తండాలో సర్పంచ్ అధ్యక్షతన ప్రజాపాలన గ్రామసభ

మథురా తండాలో సర్పంచ్ అధ్యక్షతన ప్రజాపాలన గ్రామసభ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని మథుర తండాలో గ్రామ సర్పంచ్ అనిత చౌహన్ ఆధ్వర్యంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించడం జరిగిందని జిపి కార్యదర్శి అశోక్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో నిర్వహించిన అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా చదివి ప్రజలకు జిపి కార్యదర్శి వినిపించారు. ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని ప్రజలకు గ్రామ సభలో అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, నూతన రేషన్ కార్డుల పంపిణీ, ఆసరా పెన్షన్లు, ఉచిత కరెంటు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల వద్దకు చేరే వధంగా గ్రామ స్థాయి అధికారులు నిత్యం ప్రజా సేవలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిత మోహన్ చౌవాన్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -