నవతెలంగాణ-హైదారాబాద్: తెలంగాణలో రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆయా డిపోల ఎదుట నిరసన ప్రదర్శనలు రెండో రోజు కొనసాగిస్తున్నారు. దీంతో బస్సులని డీపోలకే పరిమితమైయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రవాణా సౌక్యర్యం స్తంభించిపోయింది. మరోవైపు ప్రభుత్వం ప్రయివేట్ డ్రైవర్ల సహాయంతో పలు చోట్ల ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ప్రయివేటు డ్రైవర్లు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇచ్చాయి. అదే విధంగా బస్సులపై ఎలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం భారీ బందోబస్తు కల్పించింది. ఆయా డిపోల ఎదుట పోలీస్ పహరా ఉంది. ఆర్టీసీ సమ్మె ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి ప్రయాణికులు గంటల తరబడి రోడ్లలపై పడిగాపులు కాస్తున్నారు. ప్రయివేటు వాహనాలు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.
రెండో రోజు కదలని ఆర్టీసీ చక్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



