Thursday, April 23, 2026
E-PAPER
Homeజాతీయంఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది సజీవదహనం

ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది సజీవదహనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలోల ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మంగళవారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే..కంకర లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు బొలేరో వాహనాన్ని ఢీకొనడంతో బొలేరో వాహనంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు అలుముకోవడంతో 11 మంది అక్కడికక్కడే మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ కూడా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -