- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు రాజస్థాన్ పేసర్ నంద్రే బర్గర్‌పై మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించారు. అంతేకాకుండా, ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ కూడా నమోదు చేశారు. ఐపీఎల్ నిర్వాహకుల ప్రకారం, బర్గర్ మ్యాచ్ సమయంలో అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డాడు. ఈ లెవల్-1 ఉల్లంఘనపై మ్యాచ్ రిఫరీ నిర్ణయం తుదిగా ఉంటుంది.
- Advertisement -



