Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్అందాల పోటీల్లో అంకాపూర్ చికెన్ ను మెనూలో చేర్చాలి

అందాల పోటీల్లో అంకాపూర్ చికెన్ ను మెనూలో చేర్చాలి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : ప్రపంచ అందాల పోటీల విందు భోజనాలలో అంకాపూర్ చికెన్ మెనుగా చేర్చాలనీ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లు మాజీ జడ్పీ చైర్మన్, న్యాయవాది గంట సదానందం సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  హైదరాబాదులో ప్రపంచ సుందరీమణుల పోటీలు జరగడం మీకు తెలంగాణ ప్రజలకు గర్వకారణం అని అన్నారు. తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలు విందు భోజనాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వంటకాలు అందులో భాగంగా అంకాపూర్ చికెన్ దేశ విదేశాల్లో ఎంతో ప్రసిద్ధి చెందినది అని, వంటకాన్ని ప్రపంచ సుందరీమణులకు రుచిచూయించి అంకాపూర్ చికెన్ యొక్క ప్రతిష్టను ప్రపంచ దేశాలకు  తెలియజేయాలని కోరినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -