Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్ఆశా కార్యకర్తపై ఎఎన్ఎం దురుసు ప్రవర్తన .!

ఆశా కార్యకర్తపై ఎఎన్ఎం దురుసు ప్రవర్తన .!

- Advertisement -

నవతెలంగాణ – చందుర్తి
ఓ ఆశ కార్యకర్తపై ఎఎన్ఎం దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానాల గ్రామానికి చెందిన ఓ ఆశ కార్యకర్త  రికార్డులు సరిగా రాయలేదనే నెపంతో అమానుష పదజాలంతో, అక్షరాలలో రాయలేని విదంగా మాటలు అనడంతో మంగళవారం చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన రివ్యూ మీఁటింగ్ లో ఆశ కార్యకర్త ఆవేదనతో  వైద్యాధికారి సురేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. గతంలో కూడా కొందరు ఏఎన్ఎంలు, ఓ సూపర్ వైజర్ దర్బశాలడినట్లుగా కూడా ఆరోపణలున్నాయి.

చర్యలు శాన్యం..

తన కు జరిగిన అవమానాన్ని వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లినా.. కనీసం మందలించకుండా వదిలేయడంతో వైద్యాధికారి నిర్లక్ష్యం వల్లే  తమకు అవమానాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విచారణ చేపట్టి ఏఎన్ఎం పై చర్యలు తీసుకోవాలని పలువురు వాపోతున్నారు. దీని పై వైద్యాధికారి సురేష్ కుమార్ ను ఫోన్లో వివరణ కోరగా.. అంత బాగానే ఉంది, ఎలాంటి విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad