- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ గుండాల శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దేవస్థానం లో ప్రతి సోమవారం నిర్వహించ తలపెట్టిన అన్నదాన కార్యక్రమం సోమవారంతో ప్రారంభమైంది. ప్రతి సోమవారం ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించాలని ఆలయ అర్చకులు, కార్య నిర్వహణ అధికారి, ఆలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మండల పరిధిలోని కల్యాణవాగత తండా కు చెందిన సవిత-సుమన్ దంపతులు, బీరయ్య , శ్రీనులు అన్నదాన కార్యక్రమానికి విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ అరుణ్ నాయక్, పూజారులు నరహరి , సంతోష్ , శివ,సురేష్, కిషన్, రఘు నాయక్ , రాజు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -