- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని గ్రామ దేవత అయిన పాపమ్మ ఆలయం వద్ద ఆదివారం నాడు గల్లి వాసులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి సంవత్సరం దుర్గామాత నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈ గల్లి ప్రజలు పాపమ్మ ఆలయం వద్ద నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారు. ఈ ఏడాది కూడా నవరాత్రులను పురస్కరించుకొని గల్లి ప్రజలు ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
- Advertisement -