Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రామలింగేశ్వర ఆలయంలో అన్నదానం

రామలింగేశ్వర ఆలయంలో అన్నదానం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామంలోని పంచ తనయ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఆదివారం రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని శివ స్వాముల బృందం ఆధ్వర్యంలో వేణుగోపాల్ శర్మ  పంతులు నిర్వహించారు. అనంతరం భూషబోయిన లింగమ్మ కిష్టయ్య యాదవ్ వారి కుమారుడు కోడలు  భూషబోయిన సంతోష నరసింహ యాదవ్ లు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ  సందర్భంగా మాజీ భగత్ యూత్ అధ్యక్షులు పాక జహంగీర్ యాదవ్ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా గ్రామంలో శివ మాలధారణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు అందరూ చందాల రూపంలో సహకారం అందిస్తున్నారని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇరుముడి కార్యక్రమానికి గ్రామ ప్రజలు హాజరై తీర్థ ప్రసాదాలు   స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు నల్లమాసు బాలరాజు గౌడ్, భూష బోయిన నరసింహ యాదవ్, రాగిరి బాలరాజు గౌడు, నల్లమాసు మహేందర్ గౌడ్, నల్లమాస్  ప్రసాద్ గౌడ్, బోడుపట్ల మోహన్ రెడ్డి, పాక పెద్ద శంకర్ యాదవ్, ఈర్ల భాస్కర్, పాక చిన్న శంకర్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -