నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పడం పల్లి గ్రామంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వాహకులు గ్రామస్తులకు మహా అన్నదాన ప్రసాదం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి ఏటా 11 రోజులు సార్వజనిక్ గణేష్ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నిత్యం ఉదయం సాయంత్రం పూజలు నిర్వహించి సాయంకాలం వేల కీర్తనలు , భజనలు , సాంస్కృతిక , కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుండి కీర్తనలు చెప్పేవారు వస్తూ ఉంటారని వారి ద్వారా ప్రజలకు మంచి సందేశాలు వినిపించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ మహా అన్నదాన ప్రసాద కార్యక్రమంలో నిర్వాహకులు సైందేవ్ మారుతి, రఘు గొండ, బి . శేషారావు , ముఖేడే సంతోష్ , బి . చంద్రకాంత్ , కత్తేవార్ సంగు, జంగం సిద్దయ్యప్ప, లక్షెట్టి సంగ్రామ్, లొంగన్ హనుమంత్, గుల్లా లక్ష్మణ్ , హనుమజ్జీవర్ వీర్ భద్ర, సిహెచ్ , ఉమాకాంత్ , సిహెచ్ . బస్వంత్ , లక్సెట్టి రాజు, రామ్ గొండ , పావుడే బీమా, మహిళలు, గ్రామస్తులు , తదితరులు పాల్గొన్నారు.
సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES