- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : న్యూ నల్లకుంట స్ట్రీట్ నెంబర్ 13 ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతీ ఏటా నిర్వహించే గణేష్ ఉత్సవాల లో భాగంగా నిన్న అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు హాజరై ప్రజలకు అన్నదానం చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణం, వర్షం లేకపోవడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదానాన్ని ఆస్వాదించారు. సుమారు 1000 మంది ప్రజలు ఈ మహోత్సవంలో అన్నదానంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బిల్డర్ ప్రవీణ్ (బి ఆర్ ఎస్ లీడర్), లావణ్య (బి ఆర్ ఎస్ లీడర్, నల్లకుంట డివిజన్), అలాగే సొసైటీ సభ్యులు ప్రశాంత్ నాయుడు, సందీప్ రెడ్డి, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -