హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వా వాతియార్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అన్నగారు వస్తారు’ టైటిల్ తో రాబోతోంది. ఈ సినిమా డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శుక్రవారం డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉందన్న ఆయన హీరో కార్తీ, ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా, ఇతర టీమ్ మెంబర్స్ కు తన బెస్ట్ విశెస్ అందించారు.
టీజర్ ఎలా ఉందో చూస్తే – ‘పోలీస్ ఆఫీసర్ గా హీరో కార్తి రాకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు స్థానిక ప్రజలు. వారితో కలిసి జోష్ ఫుల్ డ్యాన్స్ స్టెప్స్ తో స్టైలిష్ గా ఎంట్రీ ఇస్తాడు కార్తి. ఈ సెలబ్రేషన్స్ జరుగుతుండగానే, మరోవైపు కృతిశెట్టి, సత్యరాజ్, ఆనంద్ రాజ్, రాజ్ కిరణ్ వంటి కీ రోల్స్ ను పరిచయం చేశారు. హీరో కార్తి చేసిన పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సులతో టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్ – వెట్రే కృష్ణన్, మ్యూజిక్ – సంతోష్ నారాయణన్, నిర్మాత – కె. ఇ. జ్ఞానవేల్ రాజారచన, దర్శకత్వం – నలన్ కుమారస్వామి.
‘అన్నగారు వస్తారు’ టీజర్ రిలీజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



