- Advertisement -
నవతెలంగాణ-రాయికల్
మండలంలోని ఒడ్డేలింగాపూర్ గ్రామంలోని మినీ గురుకుల పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె.శ్రీలత మాట్లాడుతూ ప్రభుత్వం గురుకుల పాఠశాలలకు అన్ని వసతులు కల్పిస్తూ,నాణ్యమైన విద్యను అందిస్తున్నదని తెలిపారు. గురుకుల ప్రవేశ పరీక్షలు రాసిన 11 మంది విద్యార్థులకు మొదటి దశలోనే 11 సీట్లు రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ఆదివాసి గోండి, బంజారా జానపద నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలోత్ తిరుపతి, ఉప సర్పంచ్ శంకర్ నాయక్, పంచాయతీ కార్యదర్శులు సాయికృష్ణ, రాకేష్, వినోద్, గాయకుడు గంగాధర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



