- Advertisement -
నవతెలంగాణ – కరీంనగర్
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం శిక్షణలో భాగంగా అధికారులందరికీ ఈ ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహిస్తారని సీపీ గౌష్ ఆలం పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఈ ప్రాక్టీస్ కొనసాగుతుందని తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలగందల్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ ప్రాక్టీస్ జరుగుతోంది.
- Advertisement -