Saturday, December 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమరో బాలుడిపై వీధి కుక్క దాడి

మరో బాలుడిపై వీధి కుక్క దాడి

- Advertisement -

నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌
హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ డివిజన్‌లో మరో బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. రంగారెడ్డి జిల్లా మన్సురాబాద్‌లో ఇటీవల మూగ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం విదితమే. ఇంతలోనే మరో ఘటన జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ డివిజన్‌ లక్ష్మీ నరసింహనగర్‌లో ఐదేండ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో వీధి కుక్క బాలునిపై దాడి చేసింది. గమనించిన బాలుని తాత వెంటనే కర్రతో కుక్కను కొట్టి తరిమేసాడు. దాంతో చిన్న గాయాలతో బాలుడు బయటపడ్డాడు. బాలుడికి ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. చిన్నపిల్లలను ఆరుబయట ఒంటరిగా వదిలి పెట్టొద్దని.. జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -