Tuesday, September 30, 2025
E-PAPER
Homeజాతీయంయూపీలో మరో కులదురహంకార హత్య

యూపీలో మరో కులదురహంకార హత్య

- Advertisement -

17 ఏండ్ల బాలికను కాల్చి చంపిన తండ్రి
ముజఫర్‌నగర్‌ :
ఉత్తరప్రదేశ్‌లో మరో కులదురహంకార హత్య చోటు చేసుకుంది. ఒక వైపు దేశవ్యాప్తంగా బాలికల దినోత్సవం నిర్వహించుకున్న ఆదివారం రోజునే రాష్ట్రంలోని షామ్లి జిల్లాలో ఈ దారుణం జరిగింది. కంఢ్లా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అంబేహ్త గ్రామంలో 17 ఏండ్ల బాలికను తండ్రి తుపాకీతో కాల్చిచంపాడు. సొంతింట్లో పై అంతస్తులో జరిగిన ఈ హత్యలో బాలికకు చెందిన 15 ఏండ్ల సోదరుడి ప్రమేయం కూడా ఉందని జిల్లా ఎస్‌పీ ఎన్‌పి సింగ్‌ తెలిపారు. తండ్రి, సోదరుడిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. కుటుంబ పరువు కోసం బాలికను హత్య చేసినట్లు తండ్రి అంగీకరించాడని కూడా ఎస్‌పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్టు చెప్పారు. స్థానికుల కథనం ప్రకారం.. ఇంటర్‌ చదువుతున్న బాలిక అదే ప్రాంతానికి చెందిన ఒక అబ్బాయితో సంబంధంలో ఉంది. ఆది సాయంత్రం ఫోన్‌లో మాట్లాతుండగా పట్టుకున్న తండ్రి ఈ దారుణానికి తెగబడ్డాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -