– 11కు చేరిన మృతుల సంఖ్య
నవతెలంగాణ – కూకట్‌పల్లి
హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మరో వ్యక్తి మృతిచెందాడు. సీఐ కెవి.సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆల్విన్ కాలనీ ఇంద్రహిల్స్ ప్రాంతానికి చెందిన ఆడెపు విజరు(35) రాపిడో రైడర్‌గా పని చేసేవాడు. ఈ నెల 6న అతను కూకట్‌పల్లి సాయి చరణ్ కాలనీలోని ఓ కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగాడు. తరవాత రోజు విరేచనాలు, వాంతులు కావడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేరాడు. అతని పరిస్థితి విషమించడంతో పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి గురువారం మృతిచెందాడు. మృతుడి భార్య ఆడెపు ప్రసన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది.
కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES