నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తుంది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది.
దీంతో కిష్టారం అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతాబలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో ఇరువైపులా ఎదురు కాల్పులు కొనసాగుతోన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ పర్యవేక్షిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్..మావోయిస్టు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES