Thursday, October 9, 2025
E-PAPER
Homeసినిమాహిట్‌ కాంబోలో మరో చిత్రం

హిట్‌ కాంబోలో మరో చిత్రం

- Advertisement -

గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై భారీ హిట్‌ సాధించిన ‘కమిటీ కుర్రోళ్లు’ కాంబో మరోసారి రిపీట్‌ కానుంది. డైరెక్టర్‌ యదు వంశీ మరోసారి పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై నిహారిక కొణిదెలతో కలిసి సినిమాను రూపొందించటానికి చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమా 2026లో సెట్స్‌ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ‘కమిటీ కుర్రోళ్లు’తో 11 మంది హీరోలు, 4 హీరోయిన్లు పరిచయం అయ్యారు. రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట్రికల్‌గా రూ.18.5 కోట్లు వసూళ్లను రాబడితే, నాన్‌ థియేట్రికల్‌గా రూ.6 కోట్లు బిజినెస్‌ జరిగింది. మొత్తంగా సినిమా రూ.24.5 కోట్ల వసూళ్లను సాధించి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇక అవార్డుల రేసులోనూ సత్తా చాటింది. సైమా 2025లోబెస్ట్‌ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెలకు, బెస్ట్‌ డెబ్యూ యాక్టర్‌గా సందీప్‌ సరోజ్‌కి అవార్డు వచ్చింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ అవార్డుల్లో రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెల్చుకుంది. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డు వచ్చింది. అలాగే డైరెక్టర్‌ యదు వంశీ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా అవార్డును సొంతం చేసుకున్నారు.

‘కమిటీ కుర్రోళ్లు’ సెన్సేషనల్‌ హిట్‌ తర్వాత..
పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ మీద ప్రొడక్షన్‌ నెం.2గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా.. స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్‌ ఉప్పాల అందించారు. ఈ మూవీకి మన్యం రమేష్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. ఫ్యాంటసీ, కామెడీ జోనర్‌ తెరెకెక్కనున్న ఈ మూవీకి అనుదీప్‌ దేవ్‌ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -