Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్మహిళలకు మంత్రి సీతక్క మరో శుభవార్త…

మహిళలకు మంత్రి సీతక్క మరో శుభవార్త…

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం మహిళలకు మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది మంత్రి సీతక్క. ఇక మహిళలకు బస్ డ్రైవింగ్ లో కూడా శిక్షణ అందిస్తామని… కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళ ఆర్టీసీ డ్రైవర్ గా సేవలు అందిస్తున్న సరిత మహిళలకు ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సరితను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి, అభినందించారు. ఇకపై సెల్పు ద్వారా మహిళలకు బస్సు డ్రైవింగ్ లో శిక్షణ కూడా అందిస్తామని కీలక ప్రకటన చేశారు మంత్రి సీతక్క. భారీ వాహనాల డ్రైవింగ్ లో ఉచిత శిక్షణ కార్యక్రమం… కూడా ఉంటుందని వెల్లడించారు. అంతేకాదు తెలంగాణ ఆర్టీసీలో మహిళలను రిక్రూట్మెంట్ చేసుకుంటామని… ఆ దిశగా అడుగులు వేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad