Thursday, October 23, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..

తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..

- Advertisement -

నవతెలంగాణ – మైదరాబాద్: ఇప్పటివరకూ మనం పల్లెల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చూస్తున్నాం. ఇకపై పట్టణాల్లోనూ నిర్మించుకోవచ్చు. అందుకు తెలంగాణ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. మరి ఆ ఇళ్లు ఎలా ఉంటాయి, ఎవరు అర్హులు, ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసుకుందాం. పల్లెలతోపాటూ.. పట్టణాల్లోనూ పేదలు ఉన్నారు. వారు సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో.. రేకుల షెడ్లలో ఉంటున్నారు. ఇది గమనించిన తెలంగాణ ప్రభుత్వం.. సరిగ్గా ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో.. వ్యూహాత్మకంగా మంచి జీవో 69 జారీ చేసింది. దాని ద్వారా పట్టణాల్లోని పేదలు కూడా సొంత ఇళ్లను నిర్మించుకోవచ్చు. పల్లెల్లో ఈ పథకం గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో.. ఇప్పుడు పట్టణాలపై ఫోకస్ పెట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పట్టణాల్లో ఎవరు ఇల్లు నిర్మించుకోవచ్చు అనే ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. సచివాలయంలోని తన కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో సమీక్ష జరిపి, సందేహాలకు క్లారిటీ ఇఛ్చారు. పట్టణాల్లో ఇరుకు స్థలాల్లో నివసిస్తున్న పేదలు.. సొంత ఇంటిని నిర్మించుకునేలా చేస్తామని తెలిపారు.

ఇల్లు ఎలా ఉంటుంది?:పట్టణాల్లో నిర్మించుకునే ఇంటిని 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించుకోవచ్చు. అంటే.. మరీ చిన్నది కాదు, మరీ పెద్దదీ కాదు. జి ప్లస్ 1 తరహాలో నిర్మించుకోవచ్చు. అంటే.. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ నిర్మించుకోవచ్చు. మరోలా చెప్పాలంటే.. గ్రౌండ్ ఫ్లోర్‌లో 200 చదరపు అడుగులు, మొదటి అంతస్తులో మరో 200 చదరపు అడుగుల ఇంటిని నిర్మించుకోవచ్చు. కాబట్టి.. ఇంట్లో ఎక్కువ మంది సభ్యులు ఉంటే.. ఫస్ట్ ఫ్లోర్ కూడా యూజ్ అవుతుంది.

ఇంటి నిర్మాణంలో కండీషన్లు:పట్టణాల్లో ఇంటిని నిర్మించుకునేవారికి ప్రభుత్వం కొన్ని కండీషన్లు పెట్టింది. 96 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక గది, 70 అడుగుల విస్తీర్ణంలో మరో గది నిర్మించుకోవాలి. అలాగే.. వంటగది కనీసం 35.5 చదరపు అడుగులు ఉండాలి. అలా నిర్మించుకుంటేనే.. ఆ ఇంటికి ప్రభుత్వం రూ.5,00,000 మనీ ఇస్తుంది.

ఇంటికి తప్పనిసరిగా ఉండాల్సినవి:ఇంటి నిర్మాణంలో కొన్ని అత్యవసరమైనవి ఉంటాయి. అంటే.. బాత్‌రూమ్, టాయిలెట్ వంటివి తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు.. ఇంటిని RCC స్లాబ్‌తో మాత్రమే నిర్మించాలి. ఇలా ఇంటి ప్లాన్ రెడీ చేసుకున్నవారు.. తమకు దగ్గర్లోని హౌసింగ్ డీఈఈ ఆఫీసర్‌ని కలవాలి. ప్లాన్ చూపించాలి. ఆ ఆఫీసర్ అనుమతి ఇస్తే.. అప్పుడు మాత్రమే ఇంటి నిర్మాణం చేసుకునేందుకు వీలవుతుంది.

మనీ పంపిణీ ఎలా?: పల్లెల్లో లాగానే.. పట్టణాల్లో కూడా.. సొంత ఇంటి స్థలం కలిగివుండాలి. అలాంటి వారు మాత్రమే ఇంటిని నిర్మించుకోగలరు. ఇది తప్పనిసరి షరతు. ప్రభుత్వం స్థలం ఇవ్వదు. మనీ మాత్రమే ఇస్తుంది. సొంత స్థలంలో షెడ్డు, కనీస సౌకర్యాలతో జీవిస్తున్నవారు.. దరఖాస్తు చేసుకోవచ్చు. వారు తమ స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చు. ప్రభుత్వం మొదటి అంతస్తులో రూఫ్ లెవల్ వరకు నిర్మాణం పూర్తైతే.. రూ.1లక్ష ఇస్తుంది. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్, రూఫ్ వేసిన తర్వాత రూ.1 లక్ష ఇస్తుంది. ఫస్ట్ ఫ్లోర్‌లో కాలమ్స్, స్లాబ్, గోడలు నిర్మిస్తే రూ.2 లక్షలు ఇస్తుంది. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక చివరి లక్ష రూపాయలను ఇస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -