Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఅతి త్వరలో అశ్వారావుపేటలో మరో పరిశ్రమకు శ్రీకారం

అతి త్వరలో అశ్వారావుపేటలో మరో పరిశ్రమకు శ్రీకారం

- Advertisement -

– పామాయిల్ గెలలు టన్ను రూ.25 వేలు ఉండేలా కృషి
– ప్రతీ ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల పామాయిల్ సాగు లక్ష్యం
– యూరియా కొరత తీరనుంది
– పామాయిల్ ఫ్యాక్టరీ ఆకస్మిక తనిఖీలో మంత్రి తుమ్మల
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఆయిల్ ఫెడ్ ఆద్వర్యంలో ఖమ్మం జిల్లా,వేంసూరు మండలం కల్లోరిగూడెం లో నిర్మించే పామాయిల్ పరిశ్రమ ప్రారంభోత్సవం రోజే అశ్వారావుపేటలో నిర్మించబోయే నూతన పరిశ్రమను ప్రకటిస్తామని, అతి త్వరలో అదనంగా అశ్వారావుపేటలో నూతన పరిశ్రమను నిర్మిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం నవతెలంగాణలో ప్రచురితం అయిన “కాలం చెల్లిన కర్మాగారం” శీర్షికన ప్రచురితం అయిన కధనానికి స్పందన లభించినట్లు తేటతెల్లం అయింది. ఆయన ఆదివారం ఉదయమే అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమను ఆకశ్మికంగా తనిఖీ చేసారు.ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి,మరో మేనేజర్ శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి పరిశ్రమలోని ప్రతీ విభాగాన్ని నిశితంగా పరిశీలించారు.

అనంతరం పరిశ్రమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ముందుగా సుధాకర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,పరిశ్రమ మేనేజర్ నాగబాబు లతో పరిశ్రమ సామర్ధ్యం,తరుచూ మరమ్మత్తులు,నివారణోపాయాలు,భవిష్యత్ కార్యాచరణ పై ఒక్కొక్కరిగా మాట్లాడించిన తర్వాత మంత్రి తుమ్మల మాట్లాడుతూ కర్మాగారం పై పత్రికల్లో వస్తున్న కధనాలు పై క్షేత్రస్థాయి పరిశీలన కు వచ్చానని తెలిపారు.నూతన పరిశ్రమ ఆవశ్యకతను గుర్తించామని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగు కు అనుకూల వాతావరణం ఉన్నందున ఒక్కో ఉమ్మడి జిల్లాకు లక్ష ఎకరాలు చొప్పున పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.సిద్దిపేట పామాయిల్ ఫ్యాక్టరీ త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తామని, పామాయిల్ గెలలు టన్ను రూ.25  వేలు ఉండేలా ప్రోత్సహించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కి స్వయంగా కలిసి వివరించడం జరిగిందని తెలిపారు.ఆత్మ గౌరవం తో ఆరోగ్యంగా ఉండేది ఒక్క వ్యవసాయ రంగమే నని,రానున్న రోజుల్లో రైతులకు మంచి భవిష్యత్ ఉందని ఆశాభావం వ్యక్తం చేసారు.ఆయిల్ ఫామ్ సాగు లో తెలంగాణ దేశానికి హబ్ గా మారనుంది అని,ఆయిల్ ఫామ్ లో అంతర పంటల సాగు రైతులకు అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు.

ఆయిల్ ఫెడ్ తో పాటు ప్రైవేట్ రంగంలో పామాయిల్ ఫ్యాక్టరీ లు ఏర్పాటు తో ఆయిల్ ఫామ్ రైతులకు దీర్ఘకాలిక మేలు చేకూర్చే అవకాశం ఉందన్నారు. పామాయిల్ సాగులో వినియోగించే సామాగ్రి,పరికరాలను రాయితీలతో  రైతు సేవా కేంద్రాలు ద్వారా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని,పామాయిల్ ను ఆశించే చీడపీడలు నివారణకు “లీఫ్ అండ్ సాయిల్ అనాలసిస్ ప్రయోగశాల ను రూపొందిస్తున్నామని ప్రకటించారు.

రాష్ట్రంలో యూరియా కొరత తీరనున్నది అని ప్రస్తుతం యూరియా కొరత దృష్టిలో పెట్టుకుని గుజరాత్,భోపాల్ సహా ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు రెండు లక్షల టన్నుల యూరియా తెప్పిస్తున్నామని అన్నారు. తమిళనాడులోని కరేకల్ ఫోర్టు,గంగవరం కృష్ణపట్నం ఫోర్టు ల కు యూరియా వచ్చి ఉందని ప్రతిరోజు రోడ్డు మార్గం లోనూ రైలు మార్గం లోనూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అన్ని ప్రాంతాలకు యూరియా ని సరఫరా చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని ఆయన హామీ ఇచ్చారు.

ఇరాక్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రెడ్ సీ మూసివేయడం తో యూరియా సంక్షోభం ఏర్పడిందని,చైనా నుంచి దిగుమతి చేసుకునే 70% యూరియా ఆగిపోవడం దీనికి తోడు రామగుండం,నాగార్జున ఫెర్టిలైజర్స్ మూత పడిపోవడంతో యూరియా కొరత వచ్చిందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రం లో 1 కోటి 40 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులో ఉన్నాయని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత స్థాయిలో వ్యవసాయం జరగదని,తెలంగాణలో మాత్రమే పూర్తిస్థాయి వ్యవసాయ భూములు సాగులో ఉండటంతో యూరియా కొరత తెలంగాణా రాష్ట్రంలో తీవ్రంగా కనిపిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమం లో అప్పారావు పేట పరిశ్రమ మేనేజర్ కళ్యాణ్ గౌడ్,నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు,పిన్నమనేని మురళి,బండి భాస్కర్ నిర్మల పుల్లారావు లు పాల్గొన్నారు.








- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad