Monday, July 14, 2025
E-PAPER
Homeజిల్లాలులారీని ఢీకొన్న మరోలారీ..

లారీని ఢీకొన్న మరోలారీ..

- Advertisement -

క్లీనర్ మృతి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
: డిచ్ పల్లి 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఆగిన లారీని, వెనుక నుంచి వచ్చిన మరోక లారీ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ మృతిచెందినట్లు ఎస్హెచ్ఓ మోహమ్మద్ షరీఫ్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని  చెన్నై నుంచి హర్యాణకు ద్విచక్ర వాహనాల లోడుతో వెళ్తున్న లారీ, ముందు ఆద్దం ఒక్కసారిగా పగలడంతో దానిని తొలగించడానికి డిచ్ పల్లి జాతీయ రహదారి మూలమలుపు వద్ద డ్రైవర్ నిలిపి ఉంచారు. ఆగిన లారీని దాని వెనుకలా హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వైపు వెళ్తున్న కార్లలోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది. కంటైనర్ లారీని ఢీకొట్టి పక్కనే గల డివైడర్ను దాటి ఆటువైపు దూసెకెళ్లింది. అందులో ఉన్న క్లీనర్ లారీలో నుంచి దూకడానికి ప్రయాత్నం చేయగా.. ఆదే లారీ చక్రాల కిందపడి మృతి చెందినట్లు ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరీఫ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మర్చూరికి తరలించినట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -