- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణ మయన్మార్, ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో ఆవరించిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల ఆదివారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఇది బలపడి బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతానికి ఈ అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలకు ముప్పు లేనట్లేనని తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
- Advertisement -



