నవతెలంగాణ-హైదరాబాద్: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో మైనార్టీలైనా హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ కిరణాషాపు నిర్వహకునిపై అల్లరిమూకలు మరోసారి దాడి చేసి చంపేశాయి.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మణి చక్రవర్తి స్థానిక మార్కెట్‌లో ఓ కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడు. సోమవారం రాత్రి దుకాణంలో ఉండగా.. కొందరు దుండగులు షాపులోకి చొరబడి పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. ఈ ఘటనలో మణి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
కాగా, బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిపై దాడి జరగడం నెల రోజుల వ్యవధిలో ఇది ఆరో ఘటన. అంతకుముందు అంటే డిసెంబర్ 18వ తేదీన భాలుకాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను ఓ గుంపు కొట్టి చంపింది. డిసెంబర్ 30న కూడా మైమెన్‌సింగ్ జిల్లాలోని ఓ వస్త్ర కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న హిందూ కార్మికుడిని సహోద్యోగి కాల్చి చంపాడు. ఇలా వరుస దాడులతో బంగ్లాదేశ్‌లోని హిందువుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.



