Saturday, July 26, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలోని ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌ఫోర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రామగుండం, కొత్తగూడెంలో ఎయిర్​పోర్టుల​ నిర్మాణం సాధ్యం ఇటీవల ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. వరంగల్​ఎయిర్‌పోర్టుకు అదనంగా మరో రూ.140 కోట్లు అవసరం అవుతాయని అధికారుల నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. త్వరలోనే నిధులు విడుదల కానున్నాయి.

తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్​ఎయిర్‌పోర్టు ఒక్కటే ఉంది. వరంగల్​ఎయిర్‌పోర్టు​ఎన్‌వోసీ జీఎంఆర్ సంస్థ ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నించి సఫలమైంది. దీంతో ఎయిర్‌పోర్టు​ఆథారిటి ఆఫ్ ఇండియా నిధులు కేటాయించి విమానాశ్రయాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ముందుకొచ్చింది. ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఎయిర్‌పోర్టును​ఎయిర్‌ఫోర్స్‌, రాష్ట్ర ప్రభుత్వం కలిసి వినియోగించుకోనుంది. దీనిపై ఎయిర్‌పోర్టు​ఆథారిటీ ఆఫ్​ఇండియా, ఎయిర్‌ఫోర్స్, పౌరవిమానయాన శాఖ అధికారులతో చర్చించారు. దీనికి కేంద్రం సైతం ఒకే అని చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -