Friday, May 16, 2025
Homeట్రెండింగ్ న్యూస్సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం..తెలంగాణ‌లో మ‌రో కొత్త ప‌థ‌కం

సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం..తెలంగాణ‌లో మ‌రో కొత్త ప‌థ‌కం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం మరో ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒంటరితనంతో బాధపడుతున్న.. తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వృద్ధుల కోసం ఈ కేంద్రాలు ప్రత్యేకంగా రూపొందించనున్నారు. ఈ డే కేర్ సెంటర్లలో వృద్ధుల కాలక్షేపం కోసం అనేక సౌకర్యాలు కల్పించనున్నారు. ఇండోర్ గేమ్స్, యోగా, పుస్తకాలు, కథలు, ధ్యానం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా వృద్ధులు తమ వయసుతో సమానంగా ఉన్న తోటి వారితో కలిసి ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారని అంచనా వేయబడింది. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. ఈ నిర్ణయం పట్ల సీనియర్ సిటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ డే కేర్ సెంటర్లు వృద్ధుల జీవితాల్లో ఒక ముఖ్యమైన మార్పును తీసుకువస్తాయి. ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇవి ఒక పెద్ద సహాయంగా ఉంటాయి. డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తుండటంతో సీనియర్ సిటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -