Monday, September 29, 2025
E-PAPER
Homeజాతీయంఅరుదైన బ్రెయిన్‌ ఇన్ఫెక్షన్‌తో కేరళలో మరొకరు మృతి

అరుదైన బ్రెయిన్‌ ఇన్ఫెక్షన్‌తో కేరళలో మరొకరు మృతి

- Advertisement -

తిరువనంతపురం : అరుదైన, ప్రాణాంతకమైన మెదడు ఇన్ఫెక్షన్‌తో కొజికోడ్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 45 ఏండ్ల వ్యక్తి మరణించాడని ఆరోగ్య శాఖాధికారులు శనివారం చెప్పారు. మృతుడిని వాయనాడ్‌కి చెందిన రాథేష్‌గా గుర్తించారు. హృదయ సంబంధమైన సమస్యలతో కూడా ఆయన బాధపడుతున్నారని వారు తెలిపారు. ఇదే వ్యాధి లక్షణాలతో కొజికోడ్‌ మెడికల్‌ కాలేజీలో 11మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆగస్టు మాసంలో బ్రెయిన్‌ ఫీవర్‌తో ముగ్గురు మరణించారు. ఈ మరణాల నేపథ్యంలో ఈ వ్యాధి చికిత్స కోసం కేరళ ఆరోగ్య శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. కలుషితమైన నీటిలో వుండే అమీబా వల్ల ఈ అరుదైన బ్రెయిన్‌ ఇన్ఫెక్షన్‌ వస్తుంది. కాలుష్య నీటిలో ఈదినా లేదా స్నానం చేసినా ఈ వైరస్‌ సోకే ప్రమాదముందని అధికారులు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -